రోజాకు అదే మైనస్సా

0 32

హైదరాబాద్ ముచ్చట్లు :
జగన్ వెనకాల వేయి మాటలు అనుకోవచ్చు. కానీ ఆయన ముందు మాట్లాడే నాయకులు ఎవరూ ఉండరూ అనే అంటారు. జగన్ కి పార్టీలోని నాయకులకు మధ్య వన్ టూ టెన్ అన్నట్లుగా అతి పెద్ద అంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది దాటి దగ్గరకు వచ్చేవారు బహుశా వైసీపీలో లేరు అనుకోవాల్సిందే. ఇదిలా ఉంటే జగన్ కి తన పార్టీలో ఉన్న ప్రతీ నాయకుడి గురించి అన్నీ విషయాలు తెలుస్తూంటాయి. ఆయన నెట్ వర్క్ ఆయనకు ఉంటుంది. ఇక జగన్ ఒకరికి పదవి ఇవ్వాలనుకున్నా లేక చాన్స్ ఇవ్వాలనుకున్నా కూడా తనదైన లెక్కలు వేసుకుంటారు. వాటికి తూగితేనే ఎవరికైనా పదవులు వరించేది.ఆర్కే రోజాది రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆమె తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు పోటీ చేసి ఓడినా అనుభవం బాగానే గడించారు. అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇక జగన్ వైపు షిఫ్ట్ అయ్యాక ఆమె అనుభవం వైసీపీకి ఎంతగానో ఉపయోగపడింది. 2014 నుంచి 2019 మధ్యలో ఆర్కే రోజా వైసీపీకి ఒక శక్తివంతమైన నాయకురాలిగానే ఉన్నారు. దాంతో తమ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవడం ఖాయమని ఆమె గట్టిగానే భావించారు. కానీ జగన్ మాత్రం సమీకరణల కారణంగా ఇవ్వలేకపోయారు. అయితే విస్తరణలో తనకు చాన్స్ ఖాయమని ఆర్కే రోజా పెద్దాశలే పెట్టుకున్నారుట.అయితే ఆర్కే రోజా ఇపుడు వైసీపీకి పొలిటికల్ గా బద్ధశత్రువు లాంటి ఒక మీడియా యజమాని ఆద్వర్యంలో వచ్చే జబర్దస్త్ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

రోజా విపక్షంలో ఉన్నపుడు కూడా అధినాయకత్వం అక్కడ వద్దు అని చెప్పి చూసింది అంటారు. ఇపుడు పార్టీ అధికారంలో ఉంది. పైగా రోజాకు ఎంతో కీలకమైన ఏపీఐసీసీ చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించారు. అయినా కూడా ఆమె జబర్దస్త్ ని వదలడంలేదు అన్న అసంతృప్తి అయితే వైసీపీలో ఉంది అంటున్నారు. రోజా మాత్రం తన వ్యక్తిగతం అది అంటున్నారు. మంత్రి పదవి ఇస్తే తాను వెంటనే జబర్దస్త్ వదిలేస్తాను అని ఆమె చెబుతున్నట్లుగా కూడా టాక్.ఆర్కే రోజా మీద అసలే కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె హైదరాబాద్ లోనే ఉంటారు. చుట్టపు చూపుగా తన నగరి నియోజకవర్గానికి వస్తారు అంటారు. మరో వైపు ఆమె ఏపీఐఐసీ చైర్ పర్సన్ బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడంలేదు అంటున్నారు. వీటికి మించి జబర్దస్త్ షో లో ఆమె ఉండడం కూడా నచ్చడంలేదుట. బహుశా ఇవే ఆమెకు మైనస్ అవుతాయని అంటున్నారు. విస్తరణలో ఆర్కే రోజా పేరుని పరిశీలించాలన్నా కూడా ఆమె జబర్దస్త్ వైఖరే అడ్డుపడుతుంది అని కూడా విశ్లేషిస్తున్నారు. జగన్ ఎవరి విషయంలో అయినా ఒకసారే చెబుతారు అని ఆ మీదట తన యాక్షనే చూస్తారు అని వైసీపీలో అంటూంటారు. మంత్రి పదవికి జబర్దస్త్ కి ఆర్కే రోజా లంకె పెడితే అక్కడ జగన్ కూడా అలాగే ఆలోచిస్తారు కదా అన్న మాట ఉంది. మొత్తంగా ఈ జబర్దస్త్ రాజకీయంలో రోజమ్మ ఎలా నెగ్గుతుందో చూడాల్సిందే.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Same minus for Roza

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page