వికారాబాద్ లో అమానుషం కన్న తండ్రినే వదిలేసి వెళ్లిపోయిన కొడుకు

0 37

వికారాబాద్ ముచ్చట్లు :
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండటంతో తననే వైద్యం చేయించుకోమని చెప్పి కుమారుడు వదిలేసి వెళ్లిపోయాడు. రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య ఈ నెల 3వ తేదీన కరోనా సోకి, తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. బుధవారం చంద్రయ్యకు  బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడి కన్ను, నుదుటి భాగంలో వాపు, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తెలిసిన చంద్రయ్య కుమారుడు తండ్రిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆసుపత్రి ప్రాంగణంలో పడిగాపులు కాస్తున్న చంద్రయ్యను గమనించిన ఆశా వర్కర్ వైద్యులను సంప్రదించారు. చంద్రయ్యకు ఉన్నవి బ్లాక్ ఫంగస్ లక్షణాలేనా? కాదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం చంద్రయ్యను వికారాబాద్ మహావీర్ ఆసుపత్రికి పంపారు.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

- Advertisement -

Tags:Inhumanity in Vikarabad
Kanna is the son who left his father

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page