వ్యూహకర్త కోసం జనసేనాని

0 26

హైదరాబాద్ ముచ్చట్లు :

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పట్లో పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు లేవు. ఆయనకు సినీ గ్లామర్ మీద నమ్మకం పోయిందంటున్నారు. ప్రజల్లో ఉంటేనే ఓట్లు రాలుతాయని గుర్తించారు. తాను ప్రస్తుతం పార్టీని నడిపేందుకు సినిమాలు చేస్తున్నప్పటికీ, పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. అభిమానులు, సామాజికవర్గం ఓట్లు తనకు పెద్దగా విజయం సాధించిపెట్టలేవని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తను నియమించుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. ఇందుకోసం పేరున్న సంస్థలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పోటీ చేయాల్సిన స్థానాలను ఈ సంస్థ డిసైడ్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

 

- Advertisement -

తనకు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పై నమ్మకం లేదు. తన ఎదుట నేతలు వాస్తవ పరిస్థితిని వివరించడం లేదని తెలిసింది.దీంతో ఒక ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రికతో పవన్ కల్యాణ్ ఒప్పందం చేసుకుంటారనే వార్తలు వినవస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేసి జనసేనకు బలం ఉన్న ప్రాంతాలను ఈ సంస్థ గుర్తించి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏ యే నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ తర్వాత జనసేన బలంగా ఉంది? అక్కడ బీజేపీ బలం ఎంత? బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందా? తదితర విషయాలను ఈ సర్వేద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలనుకుంటున్నారు.ఆ సర్వేల నివేదికను బట్టి అభ్యర్థుల ఎంపిక, పొత్తుల వంటివి ఉంటాయని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఒక్క స్థానం సాధించి, తాను రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో అటువంటి ఫలితాలు రిపీట్ కాకుండా ఉండాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ముందు జాగ్రత్త చర్యగా తన బలం ఎక్కడ? ఎంత? అన్న వివరాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Janasenan for the strategist

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page