యువకుడి దారుణ హత్య

0 73

పలమనేరు ముచ్చట్లు :

కూతుర్ని ప్రేమించాడని ఓ యువకుడ్ని హతమార్చి పొలాల దగ్గర వడ పూడ్చిపెట్టిన దారుణ సంఘటన పలమనేరు మండలం పెంగరగుంట లో చోటుచేసుకుంది. పలమనేరు డిఎస్పి గంగయ్య కథనం మేరకు పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10  గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ధనశేఖర్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది.  ఇద్దరూ ఇంట్లో ఉండటాన్ని గమనించిన యువతి తండ్రి యువతిని వేరే గదిలోకి పంపి ధనశేఖర్ ను హత్యచేసి బావిలో పడేసాడు.  రెండ్రోజుల తరువాత శవం తేలడంతో శవాన్ని బయటకు తీసి ముక్కలుగా చేసి పూడ్చిపెట్టాడు.  ధనశేఖర్ కనిపించకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేసారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయ వెలుగుచూసింది.  శవాన్ని బయటకు తీసిన పోలీసులు సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.  మృతుని బంధువులు హత్యచేసిన వారి వివరాలు బహిరంగంగా వెల్లడించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. డిఎస్పీ గంగయ్య న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:The brutal murder of a young man

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page