410 గ్రామాలకు తాడిపూడి ఎత్తిపోతల పథకం

0 23

విజయవాడ ముచ్చట్లు :

తాడిపూడి  ఎత్తిపోతల పధకం లో అక్రమాలు రాజ్యం ఏలుతున్నాయి. ష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 33 మండలాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. 410 గ్రామాల్లో 21 లక్షల మందికి తాగునీరందించడం ఈ పథకం లక్ష్యంలో భాగం. దీనికోసం 12,512 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 9533 ఎకరాలు అటవీ భూమి. భూసేకరణ దాదాపు పూర్తయ్యింది. అయితే భూసేరణకు సంబంధించి కొన్నిచోట్ల వివాదాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ. 4,062 కోట్లు. నాలుగు ప్యాకేజీల కింద పనులు చేపడుతున్నారు. భూసేకరణ పూర్తయ్యింది. నిర్వాసితుల బ్యాంకు ఖాతాలకు పరిహారం నిధులు జమ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో లబ్ధిదారులకు పరిహారం మంజూరైంది. ఇంకా కొన్ని చోట్ల జమకావాల్సి ఉంది. గోపాలపురం మండలంలోని రెండు గ్రామాల రైతులకు మాత్రం పరిహారం రెండుసార్లు జమ అయ్యింది. గుడ్డిగూడెం, భీమోలు గ్రామాల రైతులకు ఈ పరిహారం జమైనట్లు తెలుస్తోంది. సాంకేతికంగా చిన్న తప్పిదం వల్ల ఈ సంఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలకు అదనంగా జమైన సొమ్ము సుమారు రూ. 7.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈ తప్పిదం గుర్తించిన అధికారులు ఈ సొమ్మును తిరిగి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారని అంటున్నారు. అయితే ఇప్పటికే రైతులు ఆ సొమ్మును తీసేసుకున్నట్లు చెబుతున్నారు. రికవరీ కోసం ఆర్‌ ఆర్‌ యాక్టును ప్రయోగించినట్లు సమాచారం.ఇటీవల అమల్లోకి వచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల ఈ తప్పిదం జరిగింది. ఈ విధానం రాకముందు పాతబిల్లులు పెట్టాం. ఈ విధానం అమల్లోకి వచ్చాక కొత్తబిల్లులు పెట్టాం. పాత బిల్లులు ఆపేయాలని ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశాం. దాన్ని పట్టించుకోక పోవడం వల్ల తలెత్తిన సమస్య ఇది. రైతులతో సమావేశం నిర్వహించాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సొమ్ము తిరిగి వచ్చేస్తుంది. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని ఓ అధికారి చెప్పారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Tadipudi Upliftment Scheme for 410 villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page