ఆనందయ్య మందుపై సోమవారం తుది నిర్ణయం

0 28

అమరావతి ముచ్చట్లు :

 

ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య ఔషధం పైనా సీఎం చర్చించినట్టు రాములు తెలిపారు. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇదిలా వుండగా ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుంది. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. సీసీఆర్‌ఏఎస్‌ అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉంది. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: The final decision on Anandayya Mandu will be made on Monday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page