ఔసోలేషన్ కేంద్రానికి పరికరాలు అందజేత

0 57

కంకిపాడు ముచ్చట్లు:
రాష్ట్రంలో  కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న చర్యలకు స్వచ్ఛంద సంస్థల కూడా సహకారం అందిస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పెనమలూరు శాసన సభ్యులు కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వ అదేశాలతో ప్రతి గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ ఎర్పాటు లో భాగంగా కంకిపాడు మండలం ఉప్పులూరు సెయింట్ మేరీస్ పాఠశాలలో ఎర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఐసోలేషన్ కేంద్రానికి అమృతహస్తం పౌండేషన్ , గురు గోబిన్డ్ సింగ్ పౌండేషన్ ఆద్వర్యంలో  మంచాలు, వీల్ చైర్ , స్ట్రక్చర్ తో పాటు  మెడికల్ పరికరాలు , ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను ఎమ్మెల్యే పార్థసారథి చేతులు మీదగా అందజేశారు ..ఈ సందర్భంగా కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం లో  వైద్య సౌకర్యాలపై  వైద్య అధికారి అజమత్ తహేరా ,తహశీల్దారు టి.వి సతీష్ ను అడిగి ఎమ్మెల్యే పార్థసారథి  తెలుసుకున్నారు..  అనంతరం ఆయన  మాట్లాడుతూ  కోవిడ్  మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృష్ణికి ఇతర రాష్ట్రాలు తో పాటు ప్రధానమంత్రి సైతం అభినందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తోడు ఇటువంటి విపత్కర సమయంలో సామాజిక భాద్యత గా  దాతలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.  ఉప్పులూరు సెయింట్ మేరీస్ పాఠశాల లో ఎర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి మౌలిక సదుపాయాల కల్పనకు  సహకరించిన దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు టి.వి సతీష్, వైద్య అధికారి అజమత్ తహేరా,కంటి వెలుగు అప్తాల్మిక్ అధికారి వి.వి.రాజేష్ కుమార్,   రాచమళ్ళ శ్యామ్ ప్రసాద్, గురు గోబింద్ సింగ్ పౌండేషన్ చైర్మన్ కుల్దీప్ కౌర్, అమృతహస్తం పౌండేషన్ సభ్యులు,   శారమ్మ, వైసీపి నాయకులు మద్దాలి రామచంద్రరావు, బాకీ బాబు  తదితరులు   పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:Distribution of equipment to the Solace Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page