కొనుగోళ్లలలో ప్రధమ స్థానం సీఎం కు ధన్యావాదాలు తెలిపిన ఎమ్మెల్యే భగత్

0 13

నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా  అనుముల మండలం యాచారం గ్రామం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ శనివారం సందర్శించారు. అయన  మాట్లాడుతూ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని అందులో భాగంగా నల్గొండ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా జిల్లాలోనే నాగార్జునసాగర్ దాన్యం కొనుగోలు లో మొదటి స్థానంలో నిలిచిందని  అన్నారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతాంగం తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి  కేటీఆర్ లకు, ధాన్యం కొనుగోలు చేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, అనుముల మండల ఎంపీపీ గౌరవ సలహాదారులు పురుషోత్తం, హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ గౌరవ సలహాదారులు వెంపటి శంకరయ్య, గ్రామ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఎప్పటికప్పుడు రైతుల సమస్యల లో నిత్యం పాలుపంచుకుంటూ ప్రతి గింజ వరకు కొనుగోలు చేపించిన శాసనసభ్యులు నోముల భగత్  కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:First place in purchases
MLA Bhagat thanked the CM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page