పుంగనూరులో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించడం అభినందనీయం -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 189

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా భారీన పడి మృతి చెందిన వారి శవాలను తీసుకెళ్లి ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ కొనియాడారు. శనివారం పట్టణంలో చైర్మన్‌ అలీమ్‌బాషా తో కలసి పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులకు , హిందూజాగరణ సమితి కరోనా వారియర్స్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి, శవాలను వారి వారి సాంప్రదాయరీతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న వారికి భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కొనియాడారు. సభ్యులందరికి పిపి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, వారియర్స్ జహుర్‌బాషా, చాంద్‌బాషా, అతిక్‌, రిజ్వాన్‌, త్రిమూర్తిరెడ్డి, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Corona’s funeral in Punganur is commendable – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page