ప్రజలను బాధించే ఘటనలను సహించం కడప డిఎస్పీ

0 22

కడప ముచ్చట్లు:
ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్య వంతమైన క్రమశిక్షణను ప్రోత్సహిస్తాం. అంతే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ప్రోత్సహించమని కడప డీఎస్పీ సునీల్ స్పష్టం చేశారు. కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కడప రెండో పట్టణ ఠాణాలో ఎస్సైగా పనిచేస్తున్న జీవన్రెడ్డి రెండు రోజుల కిందట ఓ యువకుడిని కొట్టారు. ఈ ఘటన ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఎస్సైని వీఆర్కు పంపించారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారన్నారు. బాధితులతో మాట్లాడి ఘటనకు గల కారణాలు తెలుసుకుని సమగ్ర నివేదికను ఎస్పీకి అందజేస్తామన్నారు. ప్రజలను బాధించే ఘటనలు జరిగితే సహించేది లేదన్నారు. అర్బన్ సీఐ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:Tolerating incidents that annoy people
Kadapa DSP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page