బుడిగే జంగాల కాలనీలో ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ

0 16

ములుగు ముచ్చట్లు:
లాక్ డౌన్ నేపధ్యంలో ఈ రోజు ములుగు పట్టణం లోని బుడిగె జంగాల కాలనీలో  కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని ఒక్క పూట తిండికి కూడా అవస్థలు పడుతున్నారు పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం కనీసం ముఖ్య మంత్రి ఆలోచించక పోవడం దారుణమని ముఖ్యమంత్రి గారు స్పందించాలి ప్రతి పేద వాడి కుటుంబానికి 6 వేల రూపాయలు అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, మోడెమ్ మొగిలిమేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Distribution of essential commodities by MLA Sitakka in Budige Jangala Colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page