బైక్‌పై మృతదేహం తరలింపు..!

0 56

– అంబులెన్స్ ఛార్జీలు భరించలేకే..
– ఖమ్మం జిల్లాలో ఘటన.

 

ఖమ్మం ముచ్చట్లు:

 

- Advertisement -

కరోనా వ్యాప్తితో మెడికల్ సర్వీసుల ధరలన్నీ అడ్డగోలుగా మారిపోయాయి. అంబులెన్సుల ధరలైతే ఇక చెప్పే పని లేదు. ఇష్టం వచ్చినట్లుగా డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఖర్చులు భరించలేక ఓ పెద్దాయన చనిపోతే అతడి శవాన్ని కుటుంబీకులు బైక్‌‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఆత్కూరు సమీపంలో మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ(70)కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారు సైకిల్‌పై మధిరకు వస్తున్నాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారు సైకిల్‌పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్‌పైనే మృతి చెందాడు.అంబులెన్సులో తీసుకెళ్దామంటే వేలాది రూపాయలు కిరాయి అడుగుతున్నారని అందుకే మోటారు సైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లామని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన చూసిన వారంతా.. లోకం ఎలా తయారైందో అంటూ పలు రకాలుగా చర్చించుకున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Moving the body on the bike ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page