మరో ఉపఎన్నికకు వేళ

0 24

కరీంనగర్ ముచ్చట్లు :

 

హుజూరాబాద్ లో ఏడోసారి గెలిచి తన బలమేంటో చెప్పాలన్నది ఈటల రాజేందర్ ఆలోచనగా ఉంది. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు తానేంటో చూపాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమైన నేతలు, అనుచరులతో చర్చిస్తున్నారు. మండలాల వారీగా ముఖ్యనేతలను సంప్రదిస్తున్నారు.ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఉన్నారు. రెండుసార్లు ఆయన కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. తొలివిడత ఆర్థికశాఖ, పౌర సరఫరాల శాఖతో పాటు రెండోదఫా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ ఈటల రాజేందర్ ను దూరం పెట్టడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం ఈటల రాజేందర్ కు ఇష్టం లేదని చెబుతున్నారు.కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే ఈటల రాజేందర్ వాయిస్ లో ఛేంజ్ వచ్చిందంటున్నారు.

 

 

 

- Advertisement -

కరీంనగర్ జిల్లాలో తనకు పోటీగా గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని కూడా ఆయన ఓర్వలేకపోయారు. తనకు చెక్ పెట్టడానికే గంగుల కమలాకర్ ను తెచ్చారని ఈటల రాజేందర్ భావించి అప్పటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తనను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేసిన తర్వాత ఆయన ఉప ఎన్నికపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. హూజూరాబాద్ కు ఉప ఎన్నిక తధ్యమని ఈటల రాజేందర్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి పార్టీ పెట్టకుండా స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. ఇక్కడ గెలిచి కేసీఆర్ కు తన సత్తా ఏంటో చెప్పాలనుకుంటున్నారు. అందుకే అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే కాంగ్రెస్, బీజేపీలు పోటీకి పెట్టకుండా ఉండేలా ఆయన మంతనాలు జరుపుతున్నారు. ముఖాముఖి పోటీ ద్వారానే టీఆర్ఎస్ ను ఓడించాలన్నది ఈటల రాజేందర్ ఆలోచనగా ఉంది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Itala Rajender

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page