మరో ప్యాకేజీ దిశగా అడుగులు

0 18

ముంబై ముచ్చట్లు :

 

కరోనా సెకండ్వేవ్ దెబ్బ నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు మరో స్టిములస్‌‌ ప్యాకేజీ రెడీ అవుతోంది.లోకల్ లాక్డౌన్లతో గ్రోత్ పడిపోతుందనే భయాలుండటంతో ఇంకో కొత్త ప్యాకేజీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టూరిజం, ఏవియేషన్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలు, చిన్న, మీడియం కంపెనీలను కాపాడేందుకు ప్రపోజల్స్ను ఫైనాన్స్ మినిస్ట్రీ రెడీ చేస్తోంది. ప్రపోజల్స్పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సీనియర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ డిస్కషన్స్ ఇటీవలే మొదలయ్యాయని, ప్రకటన ఎప్పుడు చెయ్యాలనేది ఇంకా ఖరారు కాలేదని వారు పేర్కొంటున్నారు. కరోనా సెకండ్వేవ్ ఇండియా ఎకానమీని గట్టిగానే దెబ్బకొట్టింది. కేసుల సంఖ్య భారీగా ఉండటంతో ఆయా రాష్ట్రాలలో లోకల్ లాక్డౌన్లు విధించారు. దీంతో చాలా ఎకనమిక్ యాక్టివిటీస్ నిలిచిపోయాయి. మార్చి నెలలో సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. గతంలోలాగా ఈసారి దేశమంతటా లాక్డౌన్ను పెట్టలేదు. కానీ, కేసులు రోజుకి 2 లక్షలకి చేరడంతో లోకల్గానే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. పారిశ్రామిక యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో కూడా లాక్డౌన్లు విధించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ లాక్డౌన్లు తప్పనిసరయ్యాయి.

 

 

 

 

- Advertisement -

ఏప్రిల్ 1 నుంచి మొదలయిన కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కోసం గతంలో ఇచ్చిన గ్రోత్ అంచనాలను అన్నింటినీ ఇప్పుడు మారుస్తున్నారు. బహుశా ఈ ఏడాది రెండంకెల గ్రోత్ రావడం కష్టసాధ్యమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. నిరుద్యోగం పెరగడంతోపాటు, సేవింగ్స్ తగ్గిపోతున్నాయని, కన్జంప్షన్ కూడా అనుకున్నంతగా ఊపందుకోవడం లేదని వారంటున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా 12.5 శాతం గ్రోత్ సాధిస్తుందని ఇంతకు ముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఈ అంచనాలను జులై నెలలో మరోసారి ఐఎంఎఫ్ రివ్యూ చేయనుంది. మన రిజర్వ్ బ్యాంకు మాత్రం ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో  గ్రోత్ రేటు10.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది.ఎకానమీ పుంజుకోవడానికి ఏదైనా చేయడానికి తగినంత వెసులుబాటు ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఎకానమిస్టులు అంటున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి సుమారు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ గవర్నమెంట్కు వస్తోంది. అయినా, ఆర్థికపరమైన వెసులుబాటు కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపులతోనే కొత్త స్టిములస్‌‌ ప్యాకేజ్ ఉండొచ్చని నిర్మల్ బంగ్ ఈక్విటీస్ ఎకానమిస్ట్ తెరెసా జాన్ చెప్పారు. ఆర్బీఐ తాజాగా ఇచ్చిన డివిడెండ్తో కొంత వెసులుబాటు కలిగినా, భారీగా ప్యాకేజీ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి కష్టమేనని ఆయన అన్నారు. దాంతో, ఎడిషినల్ గ్యారంటీలు, పన్ను మినహాయింపులు, డిమాండ్ పెంచే చర్యలు వంటివి మాత్రమే ప్రకటించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

 

 

 

 

ఇవన్నీ చేయాలన్నా ప్రభుత్వం మీద పెద్ద భారమే పడుతుందని చెప్పారు. కరోనా వైరస్ కేసులు తగ్గు ముఖం పట్టాక, ఎకానమీని మళ్లీ గ్రోత్ బాట పట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎకానమీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇటీవలే వెల్లడించారు. ఎకానమిస్టులతో  స్టిములస్‌‌ ప్యాకేజీపై  డిస్కషన్స్ను కూడా నిర్వహించారని సీనియర్ ఆఫీసర్లు చెబుతున్నారు. బడ్జెట్లో చెప్పిన ఖర్చుకు కట్టుబడి ఉంటూనే, హెల్త్ సర్వీసెస్, ఫుడ్ సబ్సిడీలపై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశాలున్నాయి.ఆసియాలోనే టాప్ పెర్ఫార్మర్గా మన రూపాయి ఇటీవల ఎమర్జ్ అయింది. మరోవైపు మన స్టాక్ మార్కెట్లు కూడా ఫిబ్రవరిలోని ఆల్ టైమ్ హై వైపు మళ్లీ దూసుకెళ్తున్నాయి.

 

 

 

 

ఇదే టైములో ప్రభుత్వం స్టిములస్‌‌ ప్రపోజల్స్ను రెడీ చేస్తుండటం గమనార్హం. ఎకానమీలో ఖర్చు పెరిగేందుకు ఈ ఏడాది ఏప్రిల్లోనే కొన్ని రూల్స్ను ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజీ చేసింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ముందుగా అనుమతులు తీసుకోవక్కర్లేదని ఇతర మంత్రిత్వ శాఖలకు చెప్పింది. లాక్డౌన్లతో ఇబ్బందులపాలయిన వలస కార్మికులకు నెలకు అయిదు కిలోల ఉచిత ఫుడ్ గ్రెయిన్స్ను అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెకండ్ వేవ్తో ఈ వలస కార్మికులు సిటీల నుంచి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఏదేమైనప్పటికీ, లిబరల్గా ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఫైనాన్స్ మినిస్టర్కు లేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లోన్ల రీపేమెంట్ రూల్స్ మార్చాలని దెబ్బ తిన్న రంగాల నుంచి రిజర్వ్ బ్యాంకుపై వత్తిడి పెరుగుతోంది.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Steps towards another package

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page