వికలాంగులను ఆదుకున్న మీర్ పేట్ పోలీసులు అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0 16

హైదరాబాద్ ముచ్చట్లు:

రాచకొండ సీపీ మహేష్ భగవత్  సూచనల మేరకు మీర్ పేట్ పోలీసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా 150 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. 24 గంటలు నిత్యం డ్యూటీలో ఉంటూ దాతల సహాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వికలాంగులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మీర్పేట్ పోలీసులను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అభినందించారు. ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని మంత్రి  సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో మేరకు ప్రైవేట్ టీచర్,సిబ్బందికి ప్రతి నెల రెండు వేల రూపాయల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి నిర్వహిస్తున్న జ్వరం సర్వే మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పేదల ఎక్కడ ఇబ్బంది పడకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ లో ఇబ్బందిపడుతున్న ప్రజలను ఆదుకోవాలని దాతలకు  సూచించారు మంత్రి.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Minister Sabita Indrareddy congratulated the Mirpet police for protecting the disabled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page