షర్మిల పార్టీ వైపు చూడరెందుకో

0 29

హైదరాబాద్ ముచ్చట్లు:

వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత హైప్ వచ్చింది. తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె పార్టీ ఎలా నిలదొక్కుకుంటుందన్న కామెంట్స్ వినపడ్డాయి. ఖమ్మంలో జరిగిన సభ విజయవంతం కావడంతో వైఎస్ షర్మిల పార్టీలో చేరికలు భారీగా ఉంటాయని భావించారు. ఇటు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉన్న నేతలు వైఎస్ షర్మిల పార్టీలో చేరతారన్న ఊహగానాలు విన్పించాయి. కొందరు ప్రముఖ నేతల పేర్లు కూడా ప్రచారం లోకి వచ్చాయి.ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు వైఎస్ షర్మిల పార్టీలో చేరతారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్ వైెఎస్ షర్మిల పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గం నేతలపై వైెఎస్ షర్మిల ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలోని కోదండరామ్, ఆర్ కృష్ణయ్య వంటి నేతలను కలుపుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ షర్మిల భావించారు.కానీ దాదాపు రెండు నెలల నుంచి పార్టీలో ఎలాంటి చేరికలు లేవు. ముఖ్యనేతలందరూ వైఎస్ షర్మిలకు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో ద్వితీయ శ్రేణి నేతలు తప్ప ఎవరూ ఆ పార్టీలో లేరు. వీరితో ఎన్నికలకు వెళ్లడం వైఎస్ షర్మిలకు కష్టంతో కూడుకున్న పనే. కొండా దంపతులను సయితం వైఎస్ షర్మిల పార్టీ ఆహ్వానించిందన్న ప్రచారం జరిగింది. వారు కూడా రామని చెప్పేశారు. ఇక ఖమ్మంజిల్లాలో టీఆర్ఎస్ లో కీలక నేతగా కూడా తాను పార్టీలో చేరబోనని చెప్పినట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టకపోయినా తెలంగా ఉద్యమ నేతలందరూ కలసి కూటమిగా ఏర్పడే అవకాశముందంటున్నారు. ఈనేపథ్యంలోనే వైఎస్ షర్మిల పార్టీలో చేరేందుకు ఎవరూ సముఖంగా లేరు. ఆ పార్టీ మీద ఆంధ్ర ముద్ర ఉండటం, ఏపీలో షర్మిల సోదరుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఇక్కడ ఆ పార్టీకి ఫ్యూచర్ లేదని భావించే వైఎస్ షర్మిల వైపు ఎవరూ చూడటం లేదు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Don’t look at Sharmila’s party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page