సెక్స్ వర్కర్స్, అక్రమరవాణా భాదిత మహిళలు కు నిత్యావసరాలు పంపిణి

0 65

అమరావతి ముచ్చట్లు:
కరోనా లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ వల్ల  ఉపాది కోల్పోయిన 200 మంది సెక్స్ వర్కర్స్, అక్రమరవాణా భాదిత మహిళలు కు ఒక్కొక్కరికి రెండు వేలు విలువ చేసే నిత్యావసరాలు ఈ నెలకు పంపిణి చేసినట్లు వచ్చే నెలలో కూడా వీరికి నిత్యావసరాలు అందచేస్తామని అక్రమరవాణా భాదిత మహిళలు,  సెక్స్ వర్కర్స్ ఫోరం విముక్తి రాష్ట్ర కన్వినర్ మెహరున్నీసా తెలిపారు.
సెక్స్ వర్కర్స్ లో చాలామంది మహిళలు ఒంటరి తల్లులు వారు రోజు కూలి వేతనం పై ఆధారపడి జీవించే వారికీ లాగేనే ఏ రోజు కు ఆ రోజు పడుపు పని చేసుకొంటేనే గాని జీవనం గడపలేని స్థితిలో ఉన్నారు.   ఈ కోవిడ్  మహమ్మారి రోజు కూలి వేతనం తో జీవనం సాగించే సమాజంలోని పలు బలహీన వర్గాల ప్రజలతో పాటు సెక్స్ వర్కర్ల జీవితాలు ను కూడా అసమానంగా ప్రభావితం చేసింది. సమాజంలో సెక్స్ వర్కర్ల పై ఉన్న కళంకం, వివక్షత తో పాటు ప్రభుత్వ అధికారుల మద్దతు లేకపోవడం తో సమాజం లోని ఇతర బలహీన వర్గాలకు అందుతున్న ప్రభుత్వ పధకాలు ఇతర  సహాయ సహకారాలు సెక్స్ వర్కర్స్ కు అందటం లేదు అని  మెహరున్నీసా ఆవేదన వ్యక్తం చేసారు.  హెల్ప్ సంస్థ సహకారంతో విజయవాడ పట్టణం, గుంటూరు,   ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కరోనా సోకి తమ ఇండ్లలో నే చిక్సిత పొందుతున్న వంద మంది సెక్స్ వర్కర్స్ మరియు అక్రమరవాణా భాదిత మహిళలకు  వైద్య సేవలు అందిస్తూ వారికీ ఉచితంగా మందుల కిట్స్ అందజేసినట్లు ఆమె తెలిపారు.  ఈ నిత్యావసరాలు పంపిణి కార్యకరంలో విముక్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుష్ప, రజని,  హెల్ప్ సంస్థ రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్  వి. భాస్కర రావు,  ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాల కోఆర్డినేటర్  రోజా,  లలిత తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Distribution of essentials to sex workers and trafficked women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page