ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్

0 55

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆస్తమా రోగులకు హైదరాబాద్ కు చెందిన బత్తిన సోదరులు ఏటా పంపిణీ చేసే చేప ప్రసా దానికి ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది పంపిణీ చేయడం లేదని బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారంపర్యంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె ప్రవేశం రోజున ఏటా ఈ మందు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా లాగే ఈ ఏడాది జూన్ 7 వ తేదీన దుద్బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించి 8న కుటుంబ సభ్యులకు, బంధువులకు చేప మందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Break the distribution of fish offerings this year

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page