ఏ.పి.లో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

0 48

విజయవాడ ముచ్చట్లు :

 

విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగం,సెలయెన్ ద్వారా అర్ధగంట వ్యవదిలో బాదితుడికి కాక్ టెయిల్ ఇంజెక్షన్ అందజేసిన వైద్యులు,అరగంటలో కరోనా బాదితుడిని ఇంటికి పంపించిన ఆయుష్ వైద్యులు,కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయన్న వైద్యులు,ఈ యాంటిబాడీ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యోక్క సమ్మెళనం,ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది.మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది.ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి.12 సంవత్సరాల వయసు పైబడిన వారికి 40 కిలోల బరువు పైన మరియు స్ధూల కాయులు, 65 ఏళ్ళ వయసు పైబడిన వారు కూడా వాడవచ్చు.కిడ్నీ వ్యాది, లివర్ వ్యాది, కంట్రోల్ లేని షుగర్ వ్యాది మొదలైన వారికి ఈ యాంటిబాడి ఇంజెక్షన్ కరోనా వ్యాది ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఈ యాంటి బాడీ మిశ్రమాన్ని పేషెంట్ రక్తనాళం ద్వారా సెలయెన్ లో కలిపి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The first monoclonal antibody cocktail injection experiment to the corona in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page