వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మ్యానిఫెస్టో అమలు – మంత్రి పెద్దిరెడ్డి

0 315

పుంగనూరుముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోను అమలు చేసి, రికార్డు సృష్టించారని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ఆదివారం పట్టణంలో రెండేళ్ల సంబరాల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి రెడ్డెప్ప , పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి తో కలసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అభిమానులతో కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరోనా పరిస్థితులు కొనసాగుతున్నా,నవరత్నాలను పకడ్భంధిగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తూ ఆదర్శముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, రేష్మా, మమత, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Implementation of the Manifesto in the YSRCP Government – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page