అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

0 34

తిరుపతి ముచ్చట్లు :

 

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాల‌ను ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా జూన్ 15న ఉద‌యం 8.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య‌ ధ్వజారోహణం జరుగనుంది.బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల‌ వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Annual Brahmotsava of Sri Prasanna Venkateswaraswamy in Appalayagunta

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page