కోవిడ్ అనాథలకు ప్రభుత్వం కొండంత అండ- జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ 

0 62

-కోవిడ్ తో తల్లిదండ్రులు మృతిచెంది, అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయం

-ఐదు మంది కోవిడ్ అనాథ పిల్లలకు ఎఫ్.డి. బాండ్ల మంజూరూ ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ ,

 

- Advertisement -

విజయవాడ ముచ్చట్లు :

 

కోవిడ్ తో తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మిగిలిన పిల్లల భవిష్యత్తుకు భద్రతను కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వారి భవిష్యత్తు కు కొండంత బాసటగా నిలవడమేనని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పేర్కొన్నారు.ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన ఛాంబర్లో జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు మృతి చెంది అనాథలైన మూడు కుటుంబాలకు చెందిన 5 మంది పిల్లలకు రాష్ట్రప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షల సహాయ నిధికి సంబంధించి మంజూరు ఉత్తర్వులను అనాథ పిల్లలకు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అందజేశారు.అందులో భాగంగా కోవిడ్ భయంతో పెడనలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో అనాధులైన జక్కుల ఉషాశ్రీ సాయి(10),జక్కుల జుహితేశ్వరి(5) లకు,జగ్గయ్యపేటకు చెందిన కవల పిల్లలు షైక్ ఇన్యముల్(9), షైక్ నసిర్ హుస్సేన్(9), కంకిపాడుకు చెందిన పీతల జ్యోతి (16) పేర్లతో ఒక్కొక్కరికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల సాయం మొత్తం ఉత్తర్వులను పిల్లలకు అందజేయడం జరిగింది.

 

 

 

 

 

ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లల భవిష్యత్ అంధకారంలో పడకుండా వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అనాధ పిల్లలకు బాసటగా నిలుస్తోందన్నారు. . కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరూ మరణించినా లేదా ఇదివరకే వారిలో ఒకరు చనిపోయి, మరొకరు కోవిడ్ కారణంగా చనిపోయి వున్నా అలాంటి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను వారి భవిష్య అవసరాలకు బ్యాంకులో వారి పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులో ఆ డిపాజిట్ సొమ్ముపై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి వారి చదువులు, ఇతర ఖర్చులకు వినియోగించుకునేలా ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు.తల్లిదండ్రులలో ఏ ఒక్కరూ, ఇద్దరూ కోవిడ్ కారణంగానే చనిపోయినట్లు వైద్య ధ్రువీకరణ పత్రం కలిగి, 18 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ సాయం అందుతుందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్ఆర్ బీమా, ఇతర ఇన్సూరెన్సులతో సంబంధం లేకుండా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ఈ రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అదనంగా ప్రభుత్వం అందజేస్తోందన్నారు. దీంతో పాటు మిగతా ప్రభుత్వ పథకాలన్నీ కూడా వారి అర్హతలను బట్టి అందుతాయన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు వున్నప్పటికీ 18 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ రూ.10 లక్షల సాయం వర్తిస్తుందన్నారు. 25 సంవత్సరాలు నిండిన తర్వాత ఫిక్స్ డిపాజిట్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉందన్నారు.

 

 

 

 

 

పిల్లల బ్యాంక్ ఖాతా లు పొంది,ఎక్స్ గ్రేషియ సొమ్ము జాతీయ బ్యాంక్ లో ఫిక్సడ్ డిపాజిట్ చేసి సంబందిత ఎఫ్ డి బాండ్లు అందించేందుకు డి యంహెచ్ఓ తో సమన్వయం చేసుకోవాలని ఐసీడీస్ పిడిని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందుకున్న పిల్లల సంరక్షకులు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాలిట ప్రభుత్వమే పెద్దదిక్కుగా నిలిచిందన్నారు. వారి భవిష్యత్తు పట్ల మరింత బాధ్యతను స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనాధ పిల్లల పాలిట దేవుడిగా నిలిచారన్నారు. ఇంత పెద్ద సాయం అందించిన ప్రభుత్వానికి, సహకరించిన జిల్లా అధికారులందరికీ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా. యం.సుహాసిని, బాలల సంక్షేమ శాఖ అధికారి కె.భాస్కరరావు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి జి. రమ, ఐసీడీఎస్, సంబందిత శాఖలు అధికారులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Govt. Kondanta Anda – District Collector A. M. D. Intiaz for Kovid orphans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page