చౌడేపల్లెలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

0 57

చౌడేపల్లె ముచ్చట్లు:

 

 

కోవిడ్‌ సోకి బాధపడుతున్న రోగులకు సౌకర్యంగా గడ్డంవారిపల్లె లో గల వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి సూచించారు. సోమవారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచనలమేరకు ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రోగులకు సౌకర్యంగా అన్ని వసతులు, వైద్యం, భోజన సదుపాయం కల్పించారన్నారు. మనోధైర్యంగా చికిత్స తీసుకుంటే వైరస్‌ భారీనుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 45 యేళ్లకు పై బడిన వారందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రజలకు సిబ్బంది చైతన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం,తసహసీల్దార్‌ శేషయ్య, బోయకొండ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఎంపీటీసీ శ్రీరాములు, సర్పంచ్‌లు భాగ్యలత,లక్ష్మిదేవి, వైఎస్సార్‌సీపీ నేతలు మోహన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, శ్రీన, పెద్దన్న, హరి, బాబు తదితరులున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Take advantage of the Isolation‌ Center in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page