పాడె మోసేందుకు ఒక్క‌డు రాలేదు, తిన‌డానికి 150 మంది వ‌చ్చారు

0 87

పాట్నా ముచ్చట్లు :

 

సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన వాళ్లే రాబంధుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబంధులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబంధులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన పిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. బీహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో త‌ల్లితండ్రుల్ని కోల్పోయి అనాథ‌ల‌య్యారు.అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, క‌రోనాతో త‌ల్లి ప్రియాంక దేవి మ‌ర‌ణిస్తే అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించేందుకు 18ఏళ్ల కుమార్తె గ్రామ‌స్తుల సాయం కోరగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలిక త‌ల్లి మృత‌దేహాన్ని తన ఇంటి వద్ద అంత్య‌క్రియలు నిర్వ‌హించింది. కానీ  త‌ల్లిదండ్రుల‌ ఆత్మ‌శాంతి కి నిర్వ‌హించిన ద‌శ‌దిన క‌ర్మకు  భోజనం చేసేందుకు 150 మంది గ్రామ‌స్తులు వ‌చ్చారు. భోజ‌నం చేసి వెళుతూ తాము అప్పు ఇచ్చిన సొమ్ము బలవంతంగా వసూలు చేసుకెళ్లారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:No one came to sing, 150 people came to eat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page