పుంగనూరులో రేపిస్టును హత్య చేసిన కేసులో ఆరుమంది అరెస్ట్ – డిఎస్పీ గంగయ్య

0 899

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరులో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన రేపిస్ట్ గురుమూర్తిని హత్యచేసిన ఆరు మందిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు. సోమవారం ఆయన అర్భన్‌ సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ ఈనెల 28న అప్పిగానిపల్లెకు చెందిన వృద్ధురాలును వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గాయపరిచాడని తెలిపారు. విషయం తె లుసుకున్న గ్రామస్తులు శంకర, రాధా, సోమశేఖర్‌, అనిల్‌, హనుమంతు, రంగస్వామి అనే వ్యక్తులు తీవ్ర ఆవేదనకు లోనై గురుమూర్తిని రాడ్లతో , కట్టెలతో తీవ్రంగా కొట్టి హత్య చేశారని ఆయన తెలిపారు. కృష్ణప్ప ఫిర్యాదు మేరకు సీఐ గంగిరెడ్డి , ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, నిందితులను ప్రసన్నయ్యగారిపల్లె వద్ద అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామన్నారు. కాగా హతుడు గురుమూర్తిపై హత్యాయత్నము, అత్యాచారం కేసులు ఉన్నాయని, ఇతను శిక్ష అనుభవించి , విడుదలైనట్లు డిఎస్పీ తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు ప్రవర్తించవద్దని సూచించారు.

 

- Advertisement -

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Six arrested in Punganur rapist murder case: DSP Gangaiah

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page