ప్రజా ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 100

రామసముద్రం ముచ్చట్లు:

 

ప్రజా ఆరోగ్యానికే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెసిపల్లి సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ విడత కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాసులుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉంటే అంతకన్నా మహాత్బుగ్యంగా ఉంటారని వైకాపా ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం కరోన వ్యాధిని ఆరోగ్యశ్రీలోకి చేర్చారన్నారు. కరోన మహమ్మారి వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రత్యేకంగా వైద్యశాలలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ కరోన మహమ్మారికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోన ప్రబలకుండా నివారించడం కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి విడత కరోన వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ విడత వ్యాక్సిన్లు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇంద్రాణమ్మ, హెల్త్ సూపర్ వైజర్లు రాధాకృష్ణ, పుణ్యవతి, ఏఎన్ఎంలు సుగుణమ్మ, శ్రీవాణి, డిజిటల్ అసిస్టెంట్ భారతమ్మ, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, మహిళా పోలీస్ గౌతమి, విఆర్ఏ మహమ్మద్ రఫీ, నాయకులు బాబు, ఎల్లారెడ్డి, ఎల్.మునస్వామి, నాగరాజ, ఆశ వర్కర్లు రాధమ్మ, మంజుల, భూదేవి, రెడ్డెమ్మ, వాలింటర్లు మేఘన, రేవతి, రెడ్డెమ్మ, పుష్పవతి, దినకర్, కుమారస్వామి, వెంకటరమణ, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: High priority is given to public health – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page