రామసముద్రం మండలం మాలేనత్తం సచివాలయంలో సంబరాలు-సర్పంచ్ శ్రీనాథ రెడ్డి.

0 253

– 97శాతం మ్యానిఫెస్టో అమలు
– సర్పంచ్ శ్రీనాథరెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

 

- Advertisement -

సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాలేనత్తం సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సచివాలయంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పడిన వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తుండడంతో ఆదర్శ సీఎంగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని కొనియాడారు. ఎన్నికల మునుపు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా గుర్తించి మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల వ్యవధిలో 97 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. సచివాలయంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలను వాలింటర్ల ద్వారా నేరుగా ఇంటికే అందుస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భారతమ్మ, డిజిటల్ అసిస్టెంట్ బిందు, ఏఎన్ఎం శ్రీవాణి, లక్ష్మీ తదితర వాలింటర్లు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Celebrations at Ramasamudram Malenattam Secretariat-Sarpanch Srinatha Reddy.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page