కోవిడ్ నియంత్రణకు..

0 24

* ప్రణాళిక బద్దంగా చర్యలు
* కరోనా కేసులెక్కువున్న పంచాయతీలలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు
* నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం
* కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలకు దేశవ్యాప్తంగా గుర్తింపు
* రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మేరకు.. ఆనందయ్య మందు తయారీకి చర్యలు
* ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా మందు పంపిణీకి కృషి
* ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు ప్రణాళిక బద్దంగా చర్యలు చేపడుతుందని, చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఆ స్థాయిలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆనందయ్య మందుకు ప్రభుత్వం సంప్రదాయ మందుగా వినియోగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇమ్యూనిటి బూస్టర్ గా పని చేస్తున్న ఆనందయ్య మందును ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా ముందుస్తు ప్రయోజనకరంగా ఆనందయ్య మందుని ఇంటింటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
తుడా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు నియోజకవర్గ అధికారులతో సమీక్షించారు.

 

 

 

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా పట్ల అవగాహన కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయినా చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీలలో యువత బాధ్యతా రాహిత్యం కారణంగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయన్నారు. అందుకు గాను కేసులు పెరిగిన పంచాయతీలలో లాక్ డౌన్ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించిన కర్ఫ్యూ నేపథ్యంలో లాక్ డౌన్ అమలు కానుందన్నారు. ఇందుకు అధికారులు, పోలీసులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

 

 

 

అత్యవసర పరిస్థితులకు, వ్యక్తిగత వ్యవసాయ పనులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలు కూడా భయం, బాధ్యత గా మెలగాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో, నిత్యావసరాలు తెచ్చుకోవాలంటే తప్ప అరుగులు పై ముచ్చట్లకు ఇది సమయం కాదని హితవు పలికారు.

 

 

 

♦️ఈ పంచాయతీలలో లాక్ డౌన్ అమలు

తిరుపతి రూరల్ మండలం పరిధిలో.. పేరూరు, తనపల్లి, ధనలక్ష్మి నగర్, తిరుచానూర్, యోగిమల్లవరం, బీటీఆర్ కాలనీ, మంగళం, వెంకటపతినగర్, తుమ్మలగుంట, పద్మావతినగర్, చెర్లోపల్లి, సాయి నగర్ -1, మల్లంగుంట, వేదాంతపురం, అలాగే రామచంద్రాపురం మండలం పరిధిలో.. నడవలూరు, రామచంద్రపురం, చిన్నగొట్టిగల్లు మండలం పరిధిలో.. భాకరాపేట, చిట్టే చర్ల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి మండల పరిధిలో.. మిట్టపాలెం, పనపాకం, కొట్టాల, చంద్రగిరి, పాకాల మండల పరిధిలో.. దామలచెరువు, పాకాల, ఎర్రా వారి పాలెం మండల పరిధిలో.. యల్లమంద, ఎర్రావారి పాలెం లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు కానుంది.

 

 

 

♦️కరోనా నియంత్రణకు చర్యలు..

దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైన తిరుచానూరు పద్మావతీ నిలయం, చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్ళితే ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతామన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించామన్నారు. అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని 1.60 లక్షల ఇళ్లకు పది చొప్పున మాస్కులు పంపిణీ, కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ కరపత్రాలు, పోస్టర్లు, రేషన్ పంపిణీ వాహనాల ద్వారా పల్లె పల్లెకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామన్నారు. మైల్డ్ లెవల్ లో కరోనా కలిగి ఇంట్లో ఉన్న పేషెంట్లకు 34 వస్తువులతో కూడిన హోమ్ ఐసులేషన్ కిట్లు అందిస్తున్నామన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎవరు కాపాడతారని ఎదురుచూసే నా నియోజకవర్గ ప్రజలను బాధ్యత కలిగిన శాసన సభ్యుడిగా అండగా నిలుస్తున్నానని, అనేక కార్యక్రమాలను చేపట్టానని వివరించారు.. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు.. ధైర్యంగా ఉంటే కరోనా మన నుండి దూరంగా వెళుతుందని కరోనా పేషంట్లు చెప్పేందుకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఆత్మస్థైర్యం నింపేందుకు కోవిడ్ సెంటర్లను సందర్శిస్తున్నట్లు వెల్లడించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: To control the Kovid ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page