పంట పండింది!

0 42

–కదిరి-1812 రకం సాగుతో వేరుశెనగ అత్యధిక దిగుబడి
–వెహోక్కకు 150 నుంచి 200 కాయలు
–ఎకరాకు 70 నుంచి 74 బస్తాలు
–డ్రిప్‌సాగుతో ఫలితాలు సాధించిన రైతు గౌరీశంకర్‌రెడ్డి

 

ములకలచెరువు ముచ్చట్లు:

 

- Advertisement -

ఇంత వరకు పలు రకాల కదిరి వెరైటీ విత్తనంతో రైతులు వేరుశెనగ పంటను సాగు చేస్తూ వస్తున్నారు. తాజాగా కదిరి-1812 రకం విత్తనంతో ఇంతవరకు కరువు రైతులు చూడని పంట దిగుబడులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అనంతపురంజిల్లా కదిరిలోని వేరుశెనగ విత్తన పరిశోధనా కేంద్రం అభివృద్దిచేసిన ఈ విత్తనం సాగుకు కరువు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ములకలచెరువు మండలం గూడుపల్లెకు చెందిన రైతు ఏవీ.గౌరిశంకర్‌రెడ్డి ఈ రకం విత్తనంతో 11 ఎకరాల్లో సాగుచేసి ఎకరాకు 68 నుంచి 70 ఎకరాల దిగుబడిని సాధించారు. కదిరి పరిశోధన కేంద్రం విత్తనాన్ని రాయితీ ధరకు అందిస్తోంది. 72 కిలో విత్తనం రూ.15వేలతో కొనుగోలు చేస్తే ప్రభుత్వం 50శాతం రాయితీ రూ.7,500 వెనక్కు చెల్లిస్తుంది. ఇది రైతాంగానికి ఎంతో ప్రయోజనకరంగా మారింది.

 

×వెహోక్కకు 150కుపైనే కాయలు

గూడుపల్లె సమీపంలోని పోలాల్లో గౌరీశంకర్‌రెడ్డి డ్రిప్‌ విధానంలో ఈ పంటను సాగుచేశారు. ప్రస్తుతం పంటను తీస్తున్నారు. సరైన యాజమాన్య పద్దతులు పాటించడంతో పంట దిగుబడి అదిరింది. ఒక్కొ వెహోక్కకు 150 నుంచి 200 కాయలు కాశాయి. కొన్ని వెహోక్కలకు 300 కాయలు ఉన్నాయి. ఈ వెహోక్కలు సాధారణ వేరుశెనగ వెహోక్కలకు భిన్నంగా ఉన్నాయి. వెహోక్క వేరు లావుగా ఉండి, శాఖోపశాఖలుగా విస్తరించింది. సాధారణ వెహోక్కలు నాలుగైదు కలిపితే ఒక వెహోక్క అవుతుంది. పంటకు నెలపాటు నీరు అందించకపోయిన నష్టం కలగదు. దిగుబడి అధికంగా ఉండటంవల్ల ఎకరాకు 70 నుంచి 74 బస్తాలు (బస్తాకు 40కిలోలు) అందుతోంది. సాధారణ వేరుశెనగ దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 బస్తాలకు మించదు. కాయ నిండా గింజలు ఉన్నాయి. పంటను ఖరీఫ్‌గానూ సాగు చేసుకోవచ్చు.

×ఎకరాకు రూ.50వేలు ఖర్చు

కదిరి-1812 రకం వేరుశెనగ పంటను సాగుకు ఎకరాకు రూ.50వేలు ఖర్చువుతుంది. దుక్కులు దున్నడం నుంచి పంట తీసేవరకు ఖర్చు చేయాలి. దుక్కులు ఏ దిశల మధ్య దుక్కులు చేస్తారో విత్తనాన్ని దానికి వ్యతిరేక దిశల్లో విత్తాల్సివుంటుంది. ఎకరాకు 24 కిలోల విత్తనం అవసరం. విత్తనం విత్తాక కలుపు నివారణ చర్యలు సాధారణమే. పంటలో ఎకరాకు 6 బస్తాల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 2 బస్తాల పోటాష్‌తోపాటు 2 బస్తాల గోదావరి గోల్డ్ ఎరువులను చల్లాలి. గోదావరి గోల్డ్ ఎరువుకు బదులుగా 100 కిలో కానుగపిండి లేదా, వేప, శెనగ పిండిని వేయవచ్చు. పంట వెహోక్కలు ఎదిగాక వెహోదట 30కిలోల జింక్‌ సల్ఫేట్‌, రెండో విడతలో 50కిలోల యూరియా చల్లాలి. ఖర్చు రూ.50వేలు చేస్తే దిగుబడి ద్వారా ఎకరాకు కనీసం రూ.2లక్షలు వస్తుంది. మార్కెట్‌లో విత్తన ధరల ప్రభావం ఉంటే రూ.2.5లక్షల దాకా ఆదాయం లభిస్తుంది.

× మంచి ఆదాయం

వేరుశెనగ విత్తనంలో 51 శాతం నూనే కలిగిన గింజలు కదిరి-1812 రకం. ఇంతవరకు ఏ విత్తనానికి ఇంతశాతం నూనే లభ్యత లేదు. 11 ఎకరాల్లో సాగుచేసిన పంటకు ఎలాంటి తేగుళ్లు సోకలేదు. 5.5 ఎకరాల్లో పంట తీయగా 41కిలోల బస్తాలు 410 బస్తాల దిగుబడి వచ్చింది. సాధారణ వేరుశెనగ కంటే ఈ విత్తనంతో రైతులు పంటను సాగుచేస్తే మంచి లాభాలోస్తాయి. వర్షకాలంలో నెలరోజులు వర్షంలేకున్నా దిగుబడికి ఢోకా ఉండదు. తన పంటకు ఎకరాకు రూ.2లక్షలకు మించి ఆదాయం లభిస్తోంది.

 


—ఏవీ.గౌరీశంకర్‌రెడ్డి, రైతు, గూడుపల్లె

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The harvest is ripe!

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page