పుంగనూరులో కన్నబిడ్డను చంపుకునేందుకు కోర్టుకు వచ్చిన తల్లి

0 854

-ఇల్లు వదిలి వెళ్లిన తండ్రి
– కోర్టులు లేక వెను తిరిగి వెళ్తుండగా బిడ్డ మృతి

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ఓ కన్నతల్లి తన బిడ్డకు సరైన వైద్యం అందించలేక… కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరిన తల్లి…. పేదరికంలో ఉండగా ఖరీదైన వైద్యసేవలు అందించేందుకు డబ్బులు లేకపోవడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయినా ఓ తండ్రి….ఈ జీవన పోరాటంలో కోర్టు లేకపోవడంతో వెనుతిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో బిడ్డ మృతి చెందడం పలువురిలో విషాదం నింపింది. చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన మణి, అరుణ దంపతులకు హర్షవర్దన్‌(9)తో పాటు మరో బాలుడు ఉన్నాడు. ఇలా ఉండగా గత ఐదు సంవత్సరాలుగా హర్షవర్ధన్‌కు నోరు, ముక్కులో రక్తశ్రావం జరిగేది. ఇప్పటి వరకు లక్షలు ఖర్చు చేసి తిరుపతి , వేలూరు ఆసుపత్రుల్లో చూపించారు. నాల్గవ తరగతి చదువుతున్న హర్షవర్ధన్‌కు వైద్యసేవలు అందించేందుకు డబ్బు లేకపోవడంతో తండ్రి మణి 15 రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇలా ఉండగా తల్లి అరుణ తన బిడ్డకు కారుణ్యమరణానికి అనుమతించాలని పుంగనూరు కోర్టుకు బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టులు లేకపోవడంతో వెనుతిరిగి చౌడేపల్లెకు వెళ్తుండగా మార్గ మధ్యంలో హర్షవర్ధన్‌ మృతి చెందాడు. ఈ సంఘటన పలువురిని కలచివేసింది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: A mother who came to court to kill her child in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page