అంత్యక్రియలు ముగిసిన మహిళ తిరిగిరావడంతో అవాక్కయిన కుటుంబ సభ్యులు.!

0 54

అమరావతి ముచ్చట్లు :

 

కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో చనిపోయింది అనుకున్న మహిళ తిరిగి రావడం కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని ముత్యాల గిరిజమ్మ(75)కు కరోనా సోకడంతో మే 12 వ తేదీన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. మధ్యలో ఆమె భర్త ఆసుపత్రికి వెళ్లి కావాల్సినవి ఇచ్చి వచ్చాడు. గత నెల 15 వ తేదీ మరోసారి వెళ్లి చూడగా ఆమె బెడ్ పై కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు పంపారేమో చూసుకోమని చెప్పారు. అన్ని వార్డులు తిరిగినా కనిపించలేదు. తిరిగి సిబ్బందిని అడిగితే మార్చురీ లో చూడాలని చెప్పారు. అక్కడ పొరపాటున వేరే మహిళ మృతదేహాన్ని చూసి తన భార్యే అని చెప్పడంతో డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇదిలా వుండగా గిరిజమ్మా ఆస్పత్రిలో కోలుకొని తన కోసం ఎవరు రాకపోవడంతో బుధవారం ఆటోలో ఇంటికి చేరుకుంది. ఆమెను చూసి ఆ ప్రాంతవాసులు షాక్ కు గురయ్యారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Family members were shocked when the woman returned after the funeral.!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page