అందుబాటులోకి మిక్సింగ్ డోస్

0 31

న్యూఢిల్లీముచ్చట్లు :

కరోనా సెకండ్ వేవ్ భారత్ ను కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయానికి తెరలేపింది. వ్యాక్సిన్‌ డోస్ 1, డోస్ 2 వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్‌ వేసుకునే అవకాశం లేదు. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆల‌స్యం అవుతుండటంతో కేంద్రం మిక్స్ంగ్‌ వ్యాక్సిన్‌ అనే విధానాన్ని తీసుకురాబోతుంది. అలాగే సింగిల్ డోస్ టీకా పై కూడా కేంద్రం పరిశోధనలు జరుపుతుంది. వచ్చే నెలలో రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకునే విధంగా ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉండొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.
అలాగే రెండు డోసులు కాకుండా కొవిషీల్డ్ సింగిల్ డోస్ తీసుకునే విధానం పైనా ట్రయల్స్ జరుగుతాయని స‌మాచారం. ఈ ట్రయల్స్ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా తయారుచేస్తున్నారని మరియు రెండు వేర్వేరు టీకాల డోసులు ఇవ్వడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మరియు దుష్ప్రభావాలను ఆ యాప్ లో నమోదు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ వచ్చే వరకు మనం మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ వంటి వంటివి పాటిస్తూ మన సహకారం ప్రభుత్వానికి అందించడం.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Mixing dose available

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page