అనుమతులు లేని మల్టి స్పెషాలిటీ హాస్పటల్ సీజ్ చేసిన అధికారులు

0 24

తాడేపల్లిగూడెం ముచ్చట్లు :

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ స్టార్ మల్టి స్పెషాలిటీ హాస్పటల్ తనిఖీ లో బయటపడ్డ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. ఏ విధమైన అనుమతి పత్రాలు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటివరకు కనీసం  ప్రభుత్వ అనుమతి కోసం పత్రాలు సమర్పించలేదు. ఆరు నెలల నుండీ ఏ అనుమతులు లేకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ రోగులకు కోవిడ్ వైద్యం చేస్తు పట్టుబడ్డ శ్రీ స్టార్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్ ను ఆకస్మిక తనిఖీ చెసిన అదనపు డీఎంహెచ్వో డా. సుచిత్ర సే సీజ్ చేసారు. గత నెల22 నుండి కోవిడ్ చికిత్సపొందుతున్న గణపవరం మండలం కొమ్మర గ్రామానికి చెందిన బుద్ధాల రామకృష్ణను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పేషెంట్ ఒక్కొక్కరి నుండి రోజుకు 70 వేల రూపాయలు వసూలు చేశారని  పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యానికి అధికారుల తనిఖీ కి సంబంధించి ముందే సమాచారం అందటంతో పేషెంట్లు ఇతర హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోని  కొందరు కీలక అధికారుల అండతో ఈ ఆస్పత్రి నిర్వహణ జరుగుతున్నట్లు సమాచారం.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Unauthorized multi-specialty hospital
Officers who made the siege

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page