చౌడేపల్లి లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి- వైస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి.

0 40

చౌడేపల్లి ముచ్చట్లు:

 

మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు.బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యదర్శులు,సచివాలయం ఇంజనీరింగ్ సహాయకులు,ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ లతో సమీక్ష జరిగింది.ఈ సందర్భంగా పెద్ది రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు గ్రామాల వారీగా సిమెంటు రోడ్డు పనులు,ఆర్బికే, సచివాలయం, విల్ ఎస్ కేంద్రాలు,మురుగునీటి కాలువల నిర్మాణాల పనులు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.దశల వారీగా పనుల వివరాలు,బిల్లులు చెల్లింపు వివరాల పై చర్చించారు.మంజూరైన పనులకు అధికారులకు జారీ చేసిన సిమెంటు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పది రోజుల్లో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంటు తీసుకున్న కాంట్రాక్టర్ లు పనులు మొదలు పెట్టాలని,లేకుంటే అధికారులే భాధ్యత తీసుకోవాలని సూచించారు.పనులు పూర్తి చేసిన వారికి బిల్లులు సకాలంలో ఎంబుక్ లు రికార్డ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ దామోదర రాజు, పార్టీ కన్వీనర్ రామమూర్తి,మంత్రి పీ ఏ చంద్రహాస్, సో మల మల్లికార్జున రెడ్డి, ఎంపీడీవో వెంకటరత్నం,
పిఆర్ డి ఇ ఈ ప్రసాద్, మాజీ వైస్ ఎంపిపి రవిరెడ్డి,సర్పంచ్ వరుణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Development work in Choudepalli should be expedited. Viceroy CP Secretary of State Peddireddy.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page