ఏడాదిలో పెట్రోలు, డీజిల్ భారం 25 పైనే

0 11

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరోనా వైరస్ గత ఏడాది ఆరంభం నుంచి తన దూకుడును కొనసాగిస్తూ వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ దగ్గరి నుంచి చూస్తే 14 నెలలు గడిచిపోయాయి. ఈ కాలంలో చాలా విషయాలు మారిపోయాయి.ఇందులో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశం కూడా ఒకటి. మోదీ సర్కార్ ఇంధన ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచేసింది. ఎంతలా అంటే మీరు షాక్ అవుతారు. 15 నెలల కాలంలో పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ.20 పెరిగింది. 2020 జనవరిలో పెట్రోల్ ధర రూ.80 వద్ద ఉండేది. ఇప్పుడు రూ.100 దాటేసింది. డీజిల్ రేటు రూ.75 వద్ద ఉండేది. ఇప్పుడు రూ.95 సమీపంలో ఉంది.కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై ట్యాక్సుల రూపంలో రూ.32.98 వసూలు చేస్తోంది. అదే డీజిల్ మీద అయితే రూ.31.83 కలెక్ట్ చేస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు వసూలు చేస్తాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పెట్రోల్ రూ.100 వద్ద ఉంది.ఇకపోతే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగాయి. హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర 98.20 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.93.08 వద్ద కొనసాగుతోంది. ఏపీ అమరావతిలో అయితే పెట్రోల్ ధర రూ.100.6 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.94.88 వద్ద కొనసాగుతోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Petrol and diesel burden is around 25 per year

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page