కేసీఆర్ కు జైలు పక్కా

0 18

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రికేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన్ను ఎప్పుడు కటకటాల వెనక్కి పంపాలనే దానిపై తమ వ్యూహం తమకు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ నేతల అవినీతి వివరాలను తాము పూర్తిగా సేకరించామని తెలిపారు. దీనికి సంబంధించి 18 మంది ముఖ్య నేతలపై న్యాయపరమైన అభిప్రాయాలను నిపుణుల నుంచి సేకరించామని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు సంబంధించి కూడా సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలను పూర్తిగా తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలను మేం పట్టించుకోం. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించాం.

 

 

 

- Advertisement -

ఇప్పటికే టీఆర్ఎస్ 18 మంది ముఖ్య నేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. మా ఉద్యమ పంథానే వేరుగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు కూడా పూర్తిగా సేకరించాం. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసులపైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారు.బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీ ఉండదు. బీజేపీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: KCR was jailed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page