గ్రామాల్లో జోరుగా బెల్టుషాపుల దోపిడీలు

0 12

ఊరూర 10 నుండి 20 బెల్టుషాపులు
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు
మద్యం దుకాణాల్లో పనిచేసే వారే ప్రధాన సూత్రధారులు

నెల్లూరు ముచ్చట్లు :

 

- Advertisement -

నెల్లూరు జిల్లా ,గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట, తిన్నెల పూడి,లక్ష్మమ్మ కండ్రిగ,తిమ్మానాయుడు పాళెం ,ఇతరత్రా గ్రామాల్లో మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్కో గ్రామంలో 10 నుంచి 20 వరకు మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి.ఈ విషయం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి) అబ్కారీ శాఖ అధికారులు ,పోలీస్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు ఉంటున్నారు. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి, చేతులు దులుపుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ, బెల్లు షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20 శాతం పెంచి విక్రయాలు జరుపుతున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో 5 మండలాల్లో  మద్యం షాపులు కొనసాగుతున్నాయి.ఒక కోట మండలం లో 21 పంచాయితీలు, 40 రెవెన్యూ గ్రామాల్లో దాదాపుగా 200 కిపైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు గతంలో ఏ మండలంలో ఎంత మంది బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో గుర్తించి బైండోవర్‌ చేశారు. ప్రతి మండలానికి 25 నుంచి 35 మంది చొప్పున బైండోవర్‌ చేశారు. ఆ తర్వాత మద్యం బెల్టు షాపుల విషయాన్ని మరిచిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రామాల్లో మద్యం ధరలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు తప్పని పరిస్థితుల్లో  ధర ఎంతైనా కొనుగోలు చేసుకొని సేవించాల్సిన దుస్థితి నెలకొంది.

 

 

 

అసలే పెరిగిన రేట్లతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతుంటే బెల్టు షాపుల్లో రేట్లు పెంచడంతో తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తోందనిపలువురు వాపోతున్నారు.కాగా డిమాండ్‌ను బట్టి మద్యం వ్యాపారులు మద్యం ప్రియులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.ఊరూరా బెల్టుషాపులు.. రోజుకు వేలల్లో సంపాదనవైన్‌ షాపుల్లో పనిచేసే వారి చేతి వాటం తో గ్రామాలకు మద్యం చేరి  బెల్టుషాపులు రూపంలో ఊరూరా సరఫరా అవుతున్నాయి. మద్యం దుకాణాల్లో పనిచేసే వారు ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాల్సిన మందు కంటే 10 ఇంతలు మద్యం సీసాలు ఇవ్వడంతో చేస్తున్నారు.  బెల్టుషాపులు నిర్వహుకులు  మద్యాన్ని ఊరూరా సరఫరా చేసి లాభాలు గడించేందుకు యత్నిస్తున్నారు.  కోట పట్టణంలోని శ్యామ సుందర పురం,హరిజన వాడ, బజారు, ఆకుతోట, నార్త్ గిరిజన కాలనీ, తిన్నెల పూడి, లక్షమ్మ కండ్రిగ,తిమ్మానాయుడు పాళెం, తదితర గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా  నిత్యం  అమ్ముతున్నారు. కేవలం ఒక షాపు ద్వారానే 1000 నుంచి 5 వేల రూపాయలు ఆదాయం గడియిస్తున్నారు.   గ్రామాల్లో ఉన్న  షాపుల యజమానులు ఒక్కో బీరు, విస్కీ క్వార్టర్‌ సీసా మీద రూ. 50 నుంచి రూ.80ల వరకు అధికంగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు కిరాణ షాపుల్లో చిల్లర వస్తువుల్లా అమ్మకాలు జరుతున్నారు.
గ్రామాల్లో మందుబాబుల గొడవలు.

 

 

 

గ్రామాల్లో విరివిగా బెల్టుషాపులు ఉండడంతో గొడవలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కోట గ్రామంలోని బెల్టుషాపు దగ్గర గొడవను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. షాపులు అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులకు తాగడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. దీంతో షాపుల్లో ఖాతాలు పెట్టి మరీ తాగుడుకు బానిస అవుతున్నారు.
బెల్టుషాపులు నిర్వహుకులు జాబితా అధికారులు చెంత.
గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహుకులు జాబితా ఆబ్కారీ అధికారులు చెంత ఉన్నాయి.కానీ వారు ఉదర స్వభావం తో బెల్టుషాపులు గ్రామాల్లో జోరు అందుకుంటున్నాయి. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి) అబ్కారీ శాఖ అధికారులు చిన్నపాటి కేసులు కట్టిన బెల్ట్ షాపులు నిర్వాహకులు 2రోజుల్లో బెల్ పై వచ్చి మరలా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. బెల్టుషాపులు వల్ల గ్రామాల్లో ప్రజలకు మనశాంతి లేకుండా పోతుంది.మహిళలు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా లాక్ డౌన్ లో 12 గంటల దాకా మద్యం దుకాణాలు ఉంటాయి. ఆ తరువాత బెల్టుషాపులు నిర్వహుకులు ఇష్ట రాజ్యం.
హైటెక్ బెల్టుషాపులు.

 

 

 

స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి) అబ్కారీ శాఖ   అధికారులు దాడులు కు దొరక్కుండా బెల్టుషాపులు నిర్వహుకులు ఒక ముఠా గా ఏర్పడి  అన్నీ మండలాల్లో ఉన్న మద్యం  షాపులు నుండి మద్యం లక్షల రూపాయల ల్లో కొనుగోలు చేసి వాటిని ఎవరికి కంటపడకుండా మద్యం సీసాలు రహస్య ప్రాంతాలకు తరలిస్తారు.,మద్యం షాపులను కొద్దీ దూరంలోనే బెల్టుషాపులు నిర్వహుకులు ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకొని మందు దొరికే ప్రాంతంలో ఒక మార్క్ ప్రదేశం దగ్గర ఉండమంటారు వెంటనే మందు బాబు అక్కడికి చేరిన వెంటనే ఒక బైక్ లో మందు సీసా ఇచ్చి జంప్ అవుతారు,ఇలా హైటెక్ బెల్టుషాపులు నిర్వహిస్తూ..రోజుకు లక్షల్లో సంపాదనలు జరుగుతున్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Robberies of belt shops rampant in the villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page