టౌన్ పొలీసు స్టేషన్ ప్రారంభం

0 22

పిఠాపురం ముచ్చట్లు :

ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సత్వరం పరిష్కరించి న్యాయం జరిగే విధంగా తూర్పు గోదావరి జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లు     పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి తెలియజేశారు పిఠాపురం పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్,కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి హాజరయ్యారు.  ముందుగా పిఠాపురం పట్టణం పాత పోలీస్ స్టేషన్ ను మరమ్మతులు చేసి నూతనంగా ఏర్పాటు చేసిన టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం అనంతరం పోలీస్ స్టేషన్ల ఆవరణలో అన్ని మతాల మత పెద్దలతో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కుక్కుటేశ్వర స్వామి గుడి ఎదురుగా నూతనంగా నిర్మించబోయా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి  శంకుస్థాపన చేశారు. ఇంత త్వరతగతిన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆధునీకరించిన పిఠాపురం సర్కిల్ సిబ్బందిని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె శ్రీనివాసును  జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి,అడిషనల్ ఎస్పీ కరణంకుమార్ అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ భీమారావు,ఎస్సైలు శంకర్రావు, మొహమ్మద్ అబ్దుల్ నబి, రామలింగేశ్వరరావు, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Town Police Station Opening

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page