తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీ

0 26

ఏడేళ్ల లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని టిఆర్ఎస్ ప్రభుత్వం
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

హైదరాబాద్ ముచ్చట్లు :

 

- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ  ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు.తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలిపారు.ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదు.విభజన హామీలను కేంద్రం లోని బీజేపీ ని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదన్నారు.కోవిడ్ విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయన్నారు.మెడికల్ మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది.రోమ్ తగలబడుతుంటే..

 

 

నీరో చక్రవర్తి పిడేల్ వాయించిన చందంగా కేసీఆర్ తీరు ఉందని ఏద్దేవ చేసారు.కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పక్కనున్న ఏపీ , తమిళనాడు మాదిరిగా అమలు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు,ఏడేళ్ల లో తెలంగాణ సమాజానికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు,ప్రభుత్వం లో ఉన్న ఖాళీ లను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు.నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రెండున్నర ఏళ్లు గడిచిన స్పందన లేదు.తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి తారస్థాయికి చేరింది.2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సమిష్టి గా కృషి చేయాలని ఉత్తమ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో  మాజీ పీసీసీ  అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, బలరాం నాయక్,  మండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, నేరేళ్ల శారదా, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, కుమార్ రావ్, మహేష్ గౌడ్,  శ్రీకాంత్, మెట్టు సాయి తదితరులు

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Sonia Gandhi is credited with fulfilling the aspirations of the people of Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page