పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0 14

గోదావరి ఖని ముచ్చట్లు :

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో జరిగిన వేడుకల్లో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి అన్ని విధాలుగా మన ప్రాంతం అభివృద్ధి చెందిందని, తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణమని పోలీస్ కమిషనర్ అన్నారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

 

 

 

 

 

- Advertisement -

తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ అమరుల త్యాగ ఫలం కారణంగా స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని రామగుండం సింగరేణి సంస్థ కార్యాలయాలు, బొగ్గు గనులు, కోర్టు ఆవరణలో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Telangana Emergence Day celebrations in the industrial area

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page