పుంగనూరులో కరోనా కర్ఫ్యూకు సహకరించండి – డిఎసీ గంగయ్య

0 203

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రజలందరు సహకరించాలని పలమనేరు డిఎస్పీ గంగయ్య కోరారు. బుధవారం సాయంత్రం సీఐలు గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ వాహన కవాతును మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తో కలసి నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు కర్ఫ్యూను పకడ్భంధిగా నిర్వహిస్తున్నామన్నారు. పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవసరం ఉన్న వారు మాత్రమే బయటకు రావాలన్నారు. బయట అనవసరంగా తిరగరాదన్నారు. అవసరమైన సమయంలో మాస్క్లు , శానిటైజర్లు వినియోగిస్తూ , కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించాలన్నారు .ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలన్నదే తమ లక్ష్యమని , ఇందులో బాగంగా చట్టాలను ఒకొక్కసారి కఠినంగా అమలు చేస్తున్నామని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ కవాతులో సీఐలు మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్‌బాబు, రామకృష్ణామాచారి, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు, కృష్ణమోహన్‌, లక్షికాంత్‌, ధరణిపెనుబాక, రవికుమార్‌, మల్లికార్జునరెడ్డి , వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Contribute to Corona Curfew in Punganur – DAC Gangaiah

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page