పుంగనూరులో వైఎస్‌ జగనన్న కాలనీ పనులను పరిశీలించిన కలెక్టర్‌ హరినారాయణ్‌

0 207

-3న మంత్రులు, ఎంపిలు రాక

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ శంఖుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వర్చువల్‌ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ,జేసి వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపిలు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప హాజరుకానున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించి, కరోనా నిబంధనల మేరకు సమావేశం నిర్వహించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మను ఆదేశించారు. అలాగే మార్కెట్‌ యార్డు వద్ద , టీటీడీ కళ్యాణమండపం వద్ద రూ.1.60 కోట్లతో నిర్మించనున్న అర్భన్‌హెల్త్ సెంటర్లకు మంత్రులు శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం,అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పిఏ మునితుకారాం, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, హౌసింగ్‌ డీఈ నరసింహాచారులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Collector Harinarayan inspected the works of YS Jagannath Colony in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page