పుంగనూరు మండలంలో ప్రతి పంచాయతీ కేంద్రంలోను కోవిడ్‌ కేర్‌ సెంటర్లు

0 151

పుంగనూరు ముచ్చట్లు:

 

గ్రామీణ ప్రాంతాలలో కరోనా తీవ్రమౌతున్న నేపధ్యంలో ప్రతి పంచాయతీ కేంద్రంలోను కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వరి, కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మంత్రి పిఏ మునితుకారాం హాజరైయ్యారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ కేంద్రంలోను సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిపారు. కరోనా సోకిన వారు బయట తిరగకుండ సెంటర్‌లలో పెట్టెలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఉపాధిహామి పథకం క్రింద పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామన్నారు. అర్హులైన పేదలందరిని సంక్షేమ పథకాలు అందేలా నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ నాగరాజారెడ్డి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Kovid Care Centers in every Panchayat Center in Punganur Zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page