పేదలకు ‘తెలుగు రాజ్యం’ ఆపన్న హస్తం

0 21

హైదరాబాద్ ముచ్చట్లు :

 

పేదవారికి ఆకలి తీర్చా లన్న లక్ష్యం తో ఏర్పడిన ప్రముఖ సేవా సంస్థ ‘తెలుగు రాజ్యం’ ఆద్వర్యం లో నేడు హైదరాబాద్ నగరం లోను ఉప్పల్ చౌరస్తా వద్ద మామిడి పళ్ళను పంపిణి చేసారు.ఈ సందర్బంగా ‘తెలుగు రాజ్యం’ సంస్థ వ్యవస్తాపక అద్యక్షులు గోపరాజు రవిమాట్లాడుతూ నేటి సమాజం లో ప్రతి రోజు కడుపునిండా తిండి తినే వారు అరుదని,ముఖ్యంగా అర్దాకలితో అలమటించే నిరుపేదలకు తమ వంతు సహాయంగా ఆకలి తీర్చాలన్న లక్ష్యం తో ఈ సంస్థ ను స్థాపించినట్లు తెలిపారు. తమ ఆర్దిక వెసులుబాటును బట్టి తోచిన రేతిలో పేదల ఆకలి తీర్చడానికి అన్న దానకర్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోన మహమ్మారిని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విదించిన నేపద్యం లో నేడు తమ సంస్థ పేదవారి ఆకలి తీర్చడానికి మామిడి పళ్ళ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో సంస్థ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్(దర్గా),కార్యదర్శులు మురళి,మధుకర్,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: ‘Telugu Rajyam’ is an open hand for the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page