పేరంట్స్ నుంచి పిల్లలకు కరోనా

0 28

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సెకండ్వేవ్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు ఎవరూ వైరస్ కి మినహాయింపు కాదని సిటీకి చెందిన పీడియాట్రిషియన్లు  అంటున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేరెంట్స్ నుంచి ఇంట్లోని చిన్నారులకు వైరస్ అటాక్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు.అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. బాలింతకు పాజిటివ్ ఉంటే 90 శాతం బిడ్డకు కూడా వైరస్ సోకుతుందంటున్నారు. అందుకే డెలివరీ టైమ్ లో బిడ్డను సెపరేట్ చేసి ఎన్ఐసీయూ (న్యూ బార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో పెట్టి మొదటి 5 రోజులు అందులోనే ఉంచుతున్నామన్నారు. టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చాక తల్లీబిడ్డను ఒకచోట ఉంచుతున్నామని చెప్తున్నారు. ఐదేండ్లు దాటిన పిల్లలకు కరోనా వస్తే  టేస్టు, స్మెల్ పోతుందని, ఈ లక్షణాల ద్వారా వారికి వైరస్ అటాక్ అయినట్లు గుర్తించాలంటున్నారు. వారు తినడం మానేయడంతో పాటు నిద్రలో లేచి ఏడుస్తారని అలాంటప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ని సంప్రదించాలంటున్నారు. కరోనా సోకిన పిల్లలను ఇంట్లోనే ఓ రూమ్లో హోం ఐసోలేట్ చేసి వారికి కావాల్సిన అన్ని వస్తువులను ఆరేంజ్ చేయాలి. పేరెంట్స్ ఎప్పటికప్పుడు వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలకు సైతం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కంటే తక్కువగా ఉన్నా.. లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి.
సెకండ్ వేవ్ లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తమ పిల్లలకు కరోనా లక్షణాలున్నాయనే టెన్షన్తోనే చాలామంది పేరెంట్స్ మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు ఆన్ లైన్ కన్సల్టేషన్ ఇస్తున్నాం. హోం క్వారంటైన్లో ఉంటోన్న పిల్లలను సైతం మార్నింగ్, ఈవెనింగ్ వీడియో కాల్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాం. పిల్లల బిహేవియర్, వాళ్లు ఉంటున్న తీరు, తీసుకునే ఫుడ్ను పేరెంట్స్ గమనించాలి. పోస్ట్ కొవిడ్తో చిన్నారులు హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అందుకే వారి హెల్త్ పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రాబ్లమ్ ఉంటే పీడియాట్రిషియన్ను కన్సల్ట్ కావాలి.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Corona for children from parents

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page