పోలవరంలో మంత్రి అనిల్ పర్యటన

0 11

పోలవరం ముచ్చట్లు:

 

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోలవరం పనుల్లో పురోగతి చూపిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మంత్రి అనిల్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానెల్ మట్టితవ్వకం పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అప్రోచ్ ఛానెల్ మట్టితవ్వకం పనులు కొనసాగుతున్నాయని, 2022 ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.2016 నుంచి పోలవరం ప్రొజెక్ట్ కోసం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నా.. పనుల్లో పురోగతి చూపిస్తున్నామన్నారు. మెగా సంస్థలో పని చేస్తున్న ఇద్ధరు ఉద్యోగులు, అయిదుగురు అధికారులను కోల్పోయినందుకు నిజంగా తమకు బాధ అనిపిస్తోందన్నారు. జూమ్ మీటింగ్లతో టీడీపీ నాయకులు కాలం వెళ్ల దీస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావటం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెదవలు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి కష్టకాలంలో పని చేస్తున్న కార్మికులు, అధికారులను అభినందనిస్తున్నామని తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Minister Anil’s visit to Polavaram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page