ప్రమాద బాధిత ఏసీ టెక్నీషియన్లకు ఆర్థిక చేయూత

0 10

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లాకు చెందిన ప్రమాద బాధిత ఏసీ టెక్నీషియన్ల కుటుంబాలకు సింహపురి రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 లక్ష 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో సింహపురి ఆర్ అండ్ ఏసీ వర్కర్స్ అసోసియేషన్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన్నీరు గిరి  మరియు షేక్ షఫీ అను ఇద్దరు ఏసీ టెక్నీషియన్ లు ఏప్రిల్ 9న వర్క్ నిమిత్తం ఎన్టీఆర్ నగర్ హైవేపై ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో గిరి టెక్నీషియన్ అక్కడికక్కడే మరణించగా, షేక్ షఫీ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనే సంకల్పంతో ఏపీ ఆర్, ఆర్ ఏ సి టి డబ్ల్యూ ఏ రాష్ట్ర అధ్యక్షులు అడబాల రాజు సహకారంతో, అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మసూద్ జానీ సూచనలు సలహాల మేరకు, రాష్ట్రంలోని 40 అసోసియేషన్ల సహకారంతో సహాయత నిధిని సమకూర్చడం జరిగిందని చెప్పారు. సమకూర్చబడిన 1 లక్ష 50 వేల వేలు ఆర్థిక సహాయాన్ని సింహపురి ఏసి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అందజేయడం సంతోషకర విషయం అన్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఆశయంతోనే అసోసియేషన్ ఏర్పాటు కావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్. వసంత కుమార్, ఉపాధ్యక్షులు షేక్ ఐజెస్, కార్యదర్శి వై. గోపి, సంయుక్త కార్యదర్శి శరత్ బాబు, ట్రెజరర్ పి. వాసు, యూత్ రింగ్ లీడర్ పి. కపూర్ ఖాన్ మరియు అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Financing accident-prone AC technicians

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page