ప్రైవేటు ఆసుపత్రులలో తనిఖీలు పలు ఆసుపత్రులకు భారీ జరిమానాలు

0 30

తిరుపతి ముచ్చట్లు :
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి ఆసుపత్రి, పీలేరు లోని ప్రసాద్ ఆసుపత్రి, మదనపల్లి లోని చంద్ర మోహన్ నర్సింగ్ హోమ్ లపై జిల్లా యంత్రాంగం  53 లక్షలకు పైగానే ఫైన్లు విధించింది. మూడు  రోజుల్లో విధించిన  అపరాధ రుసుం కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆసుపత్రుల యజమాన్యాలపై ఐపీసీ 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. డ్రగ్ ఆడిట్ లో రెమ్ డెసివర్ ఇంజక్షన్ల అక్రమ వినియోగం బయటపడింది. ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా బెడ్ లు ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్యశ్రీ బాధితుల నుంచి అడ్వాన్సులు కట్టించుకుని వైద్యం చేయడం, అధిక ధరలకు సిటీ స్కాన్ లు నిర్వహించడం లాంటి అక్రమాలు జరిగాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది..

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Checks in private hospitals
Huge fines for many hospitals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page