భూముల డిజిటల్ సర్వే

0 24

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు ముందడుగు పడింది. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. భూముల డిజిటల్ సర్వేను ముందుకు తీసుకువెళ్లేందుకు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వివిధ కంపెనీలతో సీఎస్ ప్రాథమిక స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.భూముల డిజిటల్ సర్వే జరిపేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదురుకున్న సమస్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి. భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయము, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
భూముల డిజిటల్ సర్వేపై ఈ కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Digital survey of lands

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page