మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడి అనుమానాస్పద మృతి

0 27

హైదరాబాద్ ముచ్చట్లు :

 

టీడీపీ సీనియర్ నాయకుడు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అలియాస్ బాబు రెండో కుమారుడు రవీంద్ర(32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గత నెల 28 న హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లోని హయత్ ప్లేస్ హోటల్లో దిగాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గది ఖాళీ చేయాల్సి ఉండగా ఆరు వరకు కూడా బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది తలుపు తట్టినా తీయలేదు. మరో తాళంతో తలుపులు తీసి చూడగా బాత్ రూములో అతను నిర్జీవంగా పడి ఉన్నాడు. నోరు, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడే మద్యం బ్యాటిల్స్ కూడా కనిపించాయి.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Suspicious death of son of former MP Maganti Babu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page